Priyanka Gandhi: నేడు తాండూరు, కామారెడ్డిలో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Gandhi: ఎన్నికల ప్రచారానికి చివరి రోజున ప్రియాంక గాంధీ రాష్ట్రానికి రానున్నారు. తాండూరు, కామారెడ్డిలలో ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు. ప్రియాంక గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సభల్లో పాల్గొననున్నారు. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం 10 గంటలకు పఠాన్ చెరు కార్నర్ సమావేశంలో పాల్గొని అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు తాండూరులో జరిగిన జన జాతర సభకు ప్రియాంక గాంధీతో కలిసి హాజరవుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3.15 గంటలకు ప్రియాంక గాంధీతో కలిసి కామారెడ్డి రోడ్ షోలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రచారం చివరి రోజున రేవంత్, ప్రియాంక రెండు సభలు, రోడ్‌షోల్లో పాల్గొంటారు.
Also Read
- Kamareddy: ఎంతకు తెగించార్రా.. నగలు తీసేందుకు సమయం లేక.. ఏకంగా బీరువానే ఎత్తుకెళ్లిన దొంగలు(వీడియో)
- Illicit Affair: మహిళతో అన్న అక్రమ సంబంధం.. పెళ్లి కోసం చంపేసిన తమ్ముడు
- Kamareddy: కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం.. పశువులపై వరుస దాడులు
- Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత.. ప్రత్యర్థి కుటుంబంపై ట్రాక్టర్‌తో దాడి
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇప్పటికే రాష్ట్రంలో మూడుసార్లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా కాంగ్రెస్ హామీలను ప్రకటించేందుకు తుక్కుగూడ వెళ్లారు. మే 5న ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోని నిర్మల్, మహబూబ్‌నగర్ ఎంపీ నియోజకవర్గంలోని గద్వాల్ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. మే 9న మరోసారి హైదరాబాద్‌లోని తెలంగాణ కొచ్చి మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నర్సాపూర్, సరూర్‌నగర్‌లలో బహిరంగ సభలో పాల్గొన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన భుజస్కందాలపై వేసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 27 రోజుల్లో మొత్తం 56 సభలు, కార్నర్ మీటింగ్ లు, రోడ్ షోలు జరిగాయి. లోక్‌సభ ఎన్నికల్లోనూ తెలంగాణ నుంచి మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ముమ్మరంగా ప్రచారం నిర్వహించింది.
Dhanush Son : ఇంటర్ లో సత్తా చాటిన ధనుష్ కొడుకు.. తండ్రికి తగ్గ తనయుడే..
తాజావార్తలు
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?