సినీ పరిశ్రమలో దిగ్గజ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన కమల్ హాసన్ మరోసారి వార్తల్లో నిలిచారు. త్వరలో విడుదల కానున్న తన కొత్త చిత్రం ‘థగ్ లైఫ్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటూనే, ఇటీవలి వివాదాలతో కాపురం చేస్తున్నారు. అయితే, ఆయన తాజాగా చేసిన ఒక ప్రకటన సినీ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. నెక్స్ట్ జనరేషన్ నటుల్లో తన కంటే ఉన్నతంగా నటించే నలుగురు కనిపిస్తే, నటనకు విరామం ఇస్తానని కమల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…