తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం, అనుభవజ్ఞులైన విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కీలక పదవులు అప్పగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.ఎస్. శ్రీనివాసరాజును ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. ఆయన ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగనున్నారు. శ్రీనివాసరాజు ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందినవారు. గతంలో టీటీడీ జేఈవోగా విశిష్ట సేవలు అందించారు. ఇటీవల పదవీ విరమణ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఎంసీఆర్…