Today (14-02-23) Business Headlines: సుజుకీతో టీ హబ్ ఒప్పందం: జపాన్ కంపెనీ సుజుకీ మోటార్‌తో తెలంగాణ హబ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడి స్టార్టప్‌లు ఆ దేశంలోని అవకాశాలను అందిపుచ్చుకోవటానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. టీ హబ్‌లోని స్టార్టప్‌లు సుజుకీ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా గైడెన్స్ పొందొచ్చని తెలిపింది. మొబిలిటీ సెక్టార్‌లో ఎదురయ్యే ఛాలెంజ్‌లకు ఇదొక సొల్యూషన్ మాదిరిగా తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.