గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల బదిలీలకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో పలు రాష్ట్రాల గవర్నర్ల బదిలీలు ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ త్వరలో కేబినేట్ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నారని అధికారికి వర్గాలు వెల్లడించాయి. ఆయన ఈ నెలాఖరులో విదేశాలకు వెళ్లనున్నందున మరో రెండు వారాల్లోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.