Boondi Laddoo: నాలుగేళ్లుగా తప్పించుకుతిరుగుతున్న ఓ హత్య కేసులో దోషిని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్‌తో అరెస్ట్ చేశారు. రిపబ్లిక్ డే రోజున ‘‘ బూందీ లడ్డూ’’ ని పంచుతూ అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పెరోల్ పొందిన తర్వాత అప్పటి నుంచి దోషి పరారీలో ఉన్నాడు. 2008లో ఢిల్లీలోని నజాఫ్‌గఢ్ ప్రాంతంలో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యని హత్య చేసిన కైలాష్(40) అనే వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
India Republic Day: భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్ (Kartavya Path)లో ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం, సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం మరింత ప్రత్యేకంగా ఉండడంతో త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు…
Joe Biden: రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ వచ్చే నెలలో భారత్‌కు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. వచ్చే ఏడాది జనవరిలో కాకుండా వేరే తేదీలో క్వాడ్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించాలని భారతదేశం పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.