ఎక్కడా దిక్కులేని వాళ్ళంతా కాంగ్రెస్ లోకి వస్తారని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరం అనుకుంటే రెండు చోట్లా పోటీ చేస్తా.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎలా ఓట్ల కోసం వస్తారో చూస్తానని అన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి సంచళన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో నన్ను ఎదురించే మొనగాడు ఎవడు ..!? అంటూ ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో మనస్పర్థలు ఉన్నాయి.. కానీ.. మర్రి శశిధర్ రెడ్డి కూల్ పర్సన్ అని చెప్పుకొచ్చారు. నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళను బీజేపీ పక్కన పెట్టిందని, అలాంటివి అన్ని పార్టీల్లో సహజమే అన్నారు. సీనియర్ లను అవమానించే అంతటి శక్తి మాన్ ఎవరు లేరని పేర్కొన్నారు. కొన్ని అభిప్రాయాలు…
హైదరాబాద్‌లో మహిళా కాంగ్రెస్ నేత ఎస్‌ఐ కాలర్ పట్టుకొని తన అహంకారాన్ని ప్రదర్శించడం దుర్మార్గమని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రభుత్వం ఊరుకోదని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ నేతల వ్యవహార శైలిపై ధ్వజమెత్తారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆందోళనలు చేయడం దేనికని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దివాళా తీసిందని, అలాగే బీజేపీ గ్రాఫ్…
రాహుల్ ఈడీ విచారణ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన నిరసన, ఆందోళనలు,, ఉద్రిక్తతకు దారితీశాయి. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. పోలీసులను కూడా పెద్ద సంఖ్యలో మొహరించారు. కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఖైరతాబాద్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు బైక్‌కు నిప్పుపెట్టి నిరసనకు దిగారు. బస్సుల రాకపోకలను కూడా అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు పలువురు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ఆంక్షలను…
మైనర్ లకు పబ్బుల్లో అనుమతి ఎవరు ఇచ్చారు..? అని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మండిపడ్డారు. అనంతరం మాట్లాడుతూ.. మైనర్ లకు పబ్బుల్లో అనుమతి పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అన్నీ దేశాల కల్చర్ తేవడం కాదు.. అమ్మాయిలకు రక్షణ ఇవ్వండని విమర్శించారు. పబ్బులు నిబంధన పాటించేలా చూడాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేటీఆర్ ట్వీట్ లు చేసుడు కాదు.. యాక్షన్ తీసుకోవాలని ఎద్దేవ చేశారు. మైనర్ అమ్మాయి పై జరిగిన అత్యాచారంపై…