ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. అద్దె వసూలు చేసేందుకు వెళ్లిన ఓ ఇంటి యజమానురాలు హత్యకు గురైన ఘటన సంచలనం సృష్టించింది. ఘజియాబాద్‌లోని ఓరా కైమోరా సొసైటీలో నివసిస్తున్న దీపశిఖ శర్మ కుటుంబానికి రెండు ఫ్లాట్లు ఉన్నాయి. ఒక ఫ్లాట్‌లో ఆమె తన కుటుంబంతో కలిసి నివసిస్తుండగా, మరో ఫ్లాట్‌ను ఆకృతి, అజయ్ అనే భార్యాభర్తలకు అద్దెకు ఇచ్చింది. అయితే గత నాలుగు నెలలుగా వారు అద్దె చెల్లించకపోవడంతో, దాన్ని…