రెనాల్ట్ ఎట్టకేలకు బ్రెజిల్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ క్విడ్ EVని ఆవిష్కరించింది. దీనిని అక్కడ ‘క్విడ్ ఇ-టెక్’ పేరుతో విక్రయించనున్నారు. పెట్రోల్ వెర్షన్ భారతీయ ఎంట్రీ-లెవల్ కార్ల విభాగంలో తుఫానుగా నిలిచిన కారు ఇదే. ఇప్పుడు, ఎలక్ట్రిక్ రూపంలో దుమ్మురేపడానికి సిద్ధంగా ఉంది. క్విడ్ EV ప్లాట్‌ఫామ్ డాసియా స్ప్రింగ్ EV పై ఆధారపడింది. ఇది ఇప్పటికే యూరోపియన్ మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందింది. కారు డిజైన్ దాని పెట్రోల్ వెర్షన్‌ను గుర్తుకు తెస్తుంది,…