(మార్చి 14న స్వరబ్రహ్మ కేవీ మహదేవన్ జయంతి)‘మామ’గా మన తెలుగువారి మదిలో చెరిగిపోని ముద్ర వేశారు స్వరబ్రహ్మ కేవీ మహదేవన్. ఆయన బాణీలు ఈ నాటికీ జనాన్ని చిందులు వేయిస్తూనే ఉన్నాయి. మహదేవన్ మన తెలుగువారు కాదు. అయితేనేం? ఆయన బాణీలతో తెలుగుజనం ఆనందసాగరంలో మునకలేశారు. ఈ నాటికీ ఆ మధురం మనల్ని వెంటాడుతూనే ఉంది. తెలుగువారికి మహదేవన్ ‘మామ’గా మారడానికి కారణం – ఆదుర్తి సుబ్బారావు రూపొందించిన ‘మంచి మనసులు’ చిత్రంలోని పాటనే. దాదాపు ఏడుపదుల…