కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. కరోనా సమయంలో రెమిడిసవర్‌పై భారీ కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హెటిరో డ్రగ్స్ .. పార్థ సారథి రాజకీయాల్లోకి వస్తున్నారు కాబట్టి… అడగాల్సి వస్తుందని, కరోనాలో రెమిడిసవర్ ఇంజెక్షన్ జనం ప్రాణాలు కాపాడుతుంది అని గొప్పగా ఫీల్ అయ్యానన్నారు. దేశం మొత్తం దాని చుట్టే తిరిగింది, చాలా ప్రచారం జరిగిందన్నారు. రెమిడిసవర్‌లో కేంద్రం..రాష్ట్రం కీలక పాత్ర పోషించారన్న జగ్గారెడ్డి..…