Husnabad : మొంథా తుఫాన్ నిండా ముంచింది. రైతులకు చేతికొచ్చిన పంటను సర్వనాశనం చేసింది. ఇంకో రెండు రోజులైతే అమ్ముకుందాం.. డబ్బులొస్తాయి అని మురిసిన రైతుల నోట్లో మట్టి కొట్టింది. ఆరుగాళం కష్టపడి రక్తం దారబోసి పంట పండిస్తే.. ఒక్క గింజ కూడా మిగల్చకుండా ఊడ్చుకుపోయింది. ఎటు చూసినా రైతుల కన్నీళ్లే.. గుండెలు పిండేసే బాధలే.. ఈ హృదయవిదారకర ఘటన హుస్నాబాద్ మార్కెట్ యార్డులో కనిపించింది. భీకర వర్షానికి మార్కెట్ యార్డులోకి భారీగా వాన నీళ్లు వచ్చి…
Cyclone Montha : మొంథా తుఫాన్ వరంగల్ జిల్లాను ముంచేసింది. మొన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్థంభించిపోయింది. లోతట్టు ముంపు ప్రాంతాలు మొత్తం నీటిలో మునిగాయి. శాఖ రాసి కుంట, శివనగర్, బి ఆర్ నగర్, ఎస్సార్ నగర్, ఎన్టీఆర్ నగర్, కిల్లా వరంగల్ ప్రాంతాలలో ఇళ్లల్లోకి వరద నీళ్లు వచ్చాయి. ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు సహాయక చర్యలను చేపట్టాయి. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో…
CM Revanth Reddy : మొంథా తుఫాన్ తెలంగాణ మీద భారీ ప్రభావం చూపించింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాలతో పాటు ఇటు హైదరాబాద్ లోనూ భారీ వానలు పడుతున్నాయి. వందలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. చాలా ఊర్లకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ తుఫాన్ ప్రభావంపై నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అందులో భాగంగా నేడు ఉదయం 11 గంటలకు తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం సీఎం రేవంత్…
వరద సహాయ చర్యల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి సహకారం అందిస్తోంది అని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. జాతీయ విపత్తుగా ప్రకటించడానికి కొన్ని నియమ నిబంధనలు వుంటాయి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుకుంటాయి అని ఆమె తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ‍్యంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రెండు రోజుల క్రితం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 1.22 లక్షల కోట్ల రూపాయల ఎగుమతి బీమా పరిధిని కేబినెట్ ఆమోదించినట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. అలాగే, 3.03 లక్షల కోట్ల రూపాయల విలువైన సంస్కరణ-ఆధారిత, ఫలిత-అనుసంధాన పవర్ డిస్కం పథకానికి కూడా కేబినెట్ ఆమోదించిందన్నారు.…
కరోనాతో తల్లిదండ్రులు, సంరక్షలను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆదుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్… కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.5 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయనున్నట్టు ప్రకటించారు.. 18 ఏళ్లు నిండిన తర్వాత ఈ మొత్తాన్ని వడ్డీతో సహా అందించే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇక, ఆ చిన్నారులకు స్కూల్, కాలేజ్, గ్రాడ్యుయేషన్ వరకు విద్యా మరియు వసతి ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందన్న సీఎం స్టాలిన్.. అలాంటి అనాథ…