Mars: సౌర కుటుంబంలో భూమి తర్వాత నివాసయోగ్యంగా ఉండే గ్రహాల్లో ముఖ్యమైంది అంగారకుడు. భూమి లాగే మార్స్ కూడా నివాసయోగ్యానికి అనువైన ‘గోల్డీ లాక్ జోన్’లో ఉంది. కొన్ని బిలియన్ ఏళ్ల క్రితం భూమి లాగే అంగాకరకుడు కూడా సముద్రాలు, నదులు, వాతావరణం కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అందుకనే అన్ని దేశాల అంతరిక్ష సంస్థలు మార్స్‌పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాయి.
Mars: భూమి తర్వాత సౌర కుటుంబంలో మానవ నివాసానికి అనువైన గ్రహంగా శాస్త్రవేత్తలు అంగారకుడిని భావిస్తున్నారు. మూడు బిలియన్ ఏళ్లకు ముందు అంగారకుడి వాతావరణం కూడా భూమిని పోలిన విధంగా ఉండేది. అయితే కొన్ని అనూహ్య పరిణామాల కారణంగా ప్రస్తుతం ఆ గ్రహం ఎర్రటి మట్టితో నిర్జీవంగా తయారైంది.
NASA: రెండేళ్ల క్రితం నాసా అంగారకుడిపైకి పరిశోధన నిమిత్తం పర్సువరెన్స్ రోవర్ తోపాటు ఓ తేలికపాటి ఎగిరే హెలికాప్టర్ ను పంపింది. మార్స్ పై ఉండే తేలికపాటి వాతావరణంలో ఇంజెన్యూటీ హెలికాప్టర్ ఎగురుతుందా..? లేదా..? అనే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు రోవర్ తో పాటు పంపించాయి. ఇప్పటికే పలు మార్లు అంగారకుడి వాతావరణంపై ఈ హెలికాప్టర్ ఎగిరింది. తాజాగా 50వ సారి ఎగిరింది. ఏప్రిల్ 13న ఈ చిన్న హెలికాప్టర్ 145.7 సెకన్లలో 1,057.09 అడుగుల (322.2 మీటర్లు)…
InSight lander mission will come to an end in the coming weeks: అంగారకుడి గురించి ఎన్నో వివరాలను అందించిన ఇన్‌సైట్ ల్యాండర్ మరికొన్ని రోజుల్లో మూగబోనుంది. 2018లో అంగారకుడిని చేరుకున్న ఇన్‌సైట్ ల్యాండర్ అంగారకుడి అంతర్గత పొరల్లో నిర్మాణాలను, అంగారకుడిపై వచ్చే మార్స్‌క్వేక్‌లను( అంగారకుడిపై భూకంపాలు) గుర్తించింది. ఇప్పటి వరకు 1,300 కంటే ఎక్కువ మార్స్‌క్వేక్‌లను గుర్తించింది ఇన్‌సైట్ ల్యాండర్. అంగారుకుడిపై నాలుగు సంవత్సరాలుగా ఇన్‌సైట్ ల్యాండర్ పనిచేస్తోంది.