Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి.. మరికొన్ని గంటల్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి అయిన ఎస్ఐబి మాజీ చీఫ్ మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ఇండియాలోకి అడుగుపెట్టబోతున్నాడు.. రేపు సిట్ అధికారుల ఎదుట ప్రభాకర్ రావు హాజరు కాబోతున్నాడు.. ట్రావెల్ పర్మిట్ కు సంబంధించిన పత్రాలు ప్రభాకర్ రావుకు అందిన మూడు రోజుల్లోగా విచారణ అధికారుల ఎదుట హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.. అమెరికాలో ట్రావెల్…
Bangladesh: షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా దిగిపోయిన తర్వాత, ఆమెపై వందలాది కేసులు నమోదయ్యాయి. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం షేక్ హసీనాని అప్పగించాలని పలుమార్లు భారత్‌ని కోరింది. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ నేషనల్ సెంట్రల్ బ్యూరో(ఎన్సీబీ) షేక్ హసీనా కోసం ఇంటర్‌పోల్‌ని ఆశ్రయించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కీలక ములుపు చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం ఈ కేసులోని ఆరు నిందితుడికి నోటీసులు జారీ చేసింది. ఇవాళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణ హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. పోలీసులు ఈనెల 26న శ్రావణ్ రావు కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు. మూడు రోజుల సమయం తర్వాత విచారణకు హాజరు కావాలని తెలిపారు.
Yogesh Kadyan: చదువుకుంటూ సరదాగా గడపాల్సిన వయసులో అంతర్జాతీయ క్రిమినల్ గా ముద్రవేసుకున్నాడు. తెలిసి తెలియని వయసులో వేసిన తప్పటడుగు ఉన్న ఊరిని వదిలి పోయేలా చేసింది. సప్త సముద్రాలు ధాటి ఇతర దేశాలలో భయంభయంగా బ్రతకాల్సి వచ్చింది. కేవలం 19 ఏళ్లకే ఏకంగా అంతర్జాతీయ క్రిమినల్ పోలీసింగ్ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు వచ్చాయి అంటే ఆ యువకుడు ఎంతటి నేర చరిత్ర కలిగి ఉన్నాడో అర్థంచేసుకోవచ్చు. వివరాలలోకి వెళ్తే.. హర్యానా లోని ఝజ్జర్‌లో యోగేష్…
హర్యానాకు చెందిన 19 ఏళ్ల గ్యాంగ్‌స్టర్ యోగేష్ కద్యన్‌పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. కద్యన్‌పై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, ఆయుధాల చట్టం కింద అభియోగాలు మోపారు.
Interpol: భారత్-కెనడాల మధ్య ఖలిస్తాన్ అంశం చిచ్చు పెట్టింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపించారు. మరోవైపు కెనడాలో ఉంటున్న ఖలిస్తానీ వేర్పాటువాదులు మాత్రం భారత విద్వేష వైఖరని మరింత తీవ్రతరం చేశారు. అక్కడ ఉండే హిందువులకు కెనడా విడిచి వెళ్లాలని వార్నింగ్ ఇస్తున్నారు.