Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి.. మరికొన్ని గంటల్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి అయిన ఎస్ఐబి మాజీ చీఫ్ మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ఇండియాలోకి అడుగుపెట్టబోతున్నాడు.. రేపు సిట్ అధికారుల ఎదుట ప్రభాకర్ రావు హాజరు కాబోతున్నాడు.. ట్రావెల్ పర్మిట్ కు సంబంధించిన పత్రాలు ప్రభాకర్ రావుకు అందిన మూడు రోజుల్లోగా విచారణ అధికారుల ఎదుట హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.. అమెరికాలో ట్రావెల్ కు సంబంధించిన పత్రాలు రెండు రోజుల క్రితం ప్రభాకర్ రావు అందుకోవడం జరిగింది ..పత్రాలు తీసుకున్న తర్వాత ప్రభాకర్ రావు అమెరికాలో విమానం ఎక్కాడు.. ఆ తర్వాత ఇవాళ రాత్రికి హైదరాబాదులో దిగిపోతున్నాడు ..
Ameerkhan : మణిరత్నంతో మూవీ చేస్తా..
రేపు సిట్ ఎదుట హాజరు కాపుతున్నట్లు ఇప్పటికే అధికారులకు సమాచారం ఇచ్చాడు.. అయితే పోలీసుల ఎదుట హాజరై ప్రభాకర్ ఏమి చెప్పబోతున్నాడు అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది.. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి తో పాటు మాజీ అధికారుల పాత్ర గురించి ప్రభాకర్ రావు ఏమి చెప్తాడు అనేది ఇప్పుడు ఒక ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.. గత సాధారణ ఎన్నికలతో పాటు గత ప్రభుత్వంలో జరిగిన మూడు ఇప్ప ఎన్నికల సందర్భంగా జరిగిన ఫోన్ సంభాషణల మీద ప్రధానంగా ప్రభాకర్ రావుని విచారించబోతున్నారు.. దీంతో పాటుగా అప్పటి ప్రత్యక్ష పార్టీ కాంగ్రెస్తోపాటు బిజెపి లకు ఆర్థిక సహాయం చేసిన వాళ్లపై నిగా పెట్టి ఆ డబ్బులను పట్టుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.. హవాలా మార్గంలో డబ్బులను బదిలీ చేస్తున్న వారిని పట్టుకొని కేసులు నమోదు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు కొన్ని సెటిల్మెంట్లు చేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి.. మరోవైపు అప్పటి అధికార పార్టీలో అసమతి స్వరం వినిపించిన నాయకులపై కూడా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి.. మరొకవైపు హైకోర్టు జడ్జిలతో పాటు మీడియా చైర్మెన్లు జర్నలిస్టుల ఫోన్లను కూడా టాప్ చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి ..ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలంలో మేరకు ఈ విషయాలు బట్టబయలు అయినాయి.. అదనపు ఎస్పీ భుజంగారావు, తిరుపతన్న తో పాటు ప్రణీతరావు ఇచ్చిన స్టేట్మెంట్లో విషయాలు తేటతెల్లం అయినాయి..
అయితే ప్రభాకర్ రావు చెప్తేనే తాము చేసామని ఈ ముగ్గురు కూడా చెప్పడం జరిగింది. ప్రభాకర్ రావు కనుసన్నుల్లోనే అంతా వ్యవహారం నడిచిందని వెల్లడించారు. 14 నెలల క్రితం ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కావడం జరిగింది. ముందుగా ప్రణీతరావుని అధికారులు అరెస్టు చేసిన తర్వాత భుజంగరావు తిరుపన్న లను అధికారులు అరెస్టు చేశారు ..ఈ వ్యవహారంలో ప్రభాకర్ రావు పాత్ర వెలుగులోకి వస్తుండడంతో వెంటనే ఆయన అమెరికాకు వెళ్ళిపోయాడు.. తీవ్రమైన అనారోగ్యంతో చికిత్స కోసం అమెరికాకు వచ్చానని పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చాడు.. తాను వీడియో కాన్ఫరెన్స్ లేదా సెల్ కాన్ఫరెన్స్లో విచారణకు హాజరవుతానని పోలీసులకు రిక్వెస్ట్ పెట్టుకున్నాడు ..పోలీస్ అధికారులు మాత్రం తప్పనిసరిగా విచారణ అధికారుల ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని కోరారు.. ప్రభాకర్ రావు స్పందించకపోవడంతో అతని పాస్పోర్ట్ ని రద్దు చేయించారు..
మరోవైపు ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించారు ..ఇంకొకవైపు ప్రభాకర్ రావుని అమెరికా నుంచి డిపోర్టు చేయించేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ కావాలని హైకోర్టు ఆశ్రయిస్తే అక్కడ చుక్క ఎదురయింది.. దీంతో సుప్రీంకోర్టుని ప్రభాకర్ రావు ఆశ్రయించాడు.. అక్కడ ప్రభాకర్ రావుకు కొంత ఊరట లభించింది ..ప్రభాకర్ రావు పాస్పోర్ట్ వెంటనే పునరుద్ధరించి ఇండియాకు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ..ఈ ఆదేశాలతో ప్రభాకర్ రావు తిరిగి హైదరాబాద్ కు వస్తున్నాడు ..హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత సిట్ ఎదుట హాజరు కాబోతున్నాడు ..ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా అప్పటి ప్రభుత్వ మాజీ ప్రభుత్వ పెద్దల పాత్ర వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది..
Rinku Singh Engagement: ఘనంగా రింకూ – ప్రియా సరోజ ఎంగేజ్మెంట్.. కన్నీళ్లు పెట్టుకున్న ఎంపీ..!