మిర్చి ధర కొత్త రికార్డు సృష్టించింది. వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్ లో ఆల్ టైమ్ హై రికార్డులు నెలకొల్పింది. వరంగల్ జిల్లాలో మిర్చి ధర బంగారం రేటు దాటి పోయింది. దేశీ మిర్చి ధర ఏకంగా రూ. 80,100 వేలు పలికింది. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశీ కొత్త మిర్చి చరిత్రలోనే హై రేట్ నమోదు చేసుకుంది.
ఏపీలో సిలికా శాండ్ ఈ ఆక్షన్ (E-Auction) నిర్వహించింది ప్రభుత్వం. దీనికి అనూహ్య స్పందన లభించింది. నెల్లూరు జిల్లాలో సిలికాశాండ్ ఈ- ఆక్షన్ కు రికార్డు స్థాయిలో బిడ్ (Bid) దాఖలయింది. చిల్లకూర్ మండలంలోని తూర్పు కానుపూర్ గ్రామ పరిధిలోని ఆరు హెక్టార్లల్లోని సిలికా శాండ్ కి ఈ-ఆక్షన్ నిర్వహించారు. రూ.1.60 కోట్లతో ప్రారంభమైంది ఈ-ఆక్షన్. ఇందులో అత్యధికంగా రూ. 3.16 కోట్లు కోట్ చేసి బిడ్ దక్కించుకుంది స్మార్కో ఇండస్ట్రీస్. గ్లాస్ ఆధారిత పరిశ్రమలో కీలక…