UPI Payments: మాల్దీవుల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వ్యవస్థను అమలు చేయడానికి మాల్దీవులతో భారతదేశం అవగాహన ఒప్పందం (MOU) పై సంతకం చేసింది. ఈ చొరవ వల్ల మాల్దీవుల పర్యాటక పరిశ్రమను గణనీయంగా పెంచుతుందని అంచనా వేస్తున్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మూడు రోజుల అధికారిక పర్యటన సందర్భంగా శుక్రవారం ఈ ఒప్పందాన్ని అధికారికంగా ప్రారంభించారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యొక్క ఆవిష్కరణ అయిన యూపీఐ సిస్టమ్ మొబైల్ ఫోన్‌ల…