అసలే కాలుష్యం.. ఆపై దీపావళి తోడైంది. దీంతో దేశ రాజధాని ప్రాంతం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఢిల్లీ లోని వాహనాలు, నిర్మాణాలు, రహదారులు, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యంతో పాటు, పొరుగున ఉన్న హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల కాల్చివేత, బొగ్గు ఆధారిత విద్సుదుత్పత్తి కేంద్రాల నుంచి వెలువడే కాలుష్యం ఇబ్బందుల పాలు చేస్తోంది. దీనికి తోడు దీపావళి పండుగ కాలుష్యం కూడా తోడవడంతో పరిస్థితి విషమించింది. ధూళి అణువులు 2.5 మైక్రాన్స్ పరిమాణంలో…