ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) అభిమానులకు షాకింగ్ న్యూస్. ఐపీఎల్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో ఒకటైన ఆర్‌సీబీ ఫ్రాంచైజీని అమ్మేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్‌సీబీ యాజమాన్యం 'డయాజియో' ఫ్రాంచైజీని విక్రయించే అవకాశాలను పరిశీలిస్తోందట.