ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ వైదొలగడంతో కొత్త కెప్టెన్ కోసం వెతికే పనిలో ఆ జట్టు ఉంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న వేలంలో శనివారం రోజు ఆర్‌సీబీ జట్టు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్‌ను రూ.7 కోట్లకు దక్కించుకుంది. అయితే ఆర్సీబీ 100 శాతం డుప్లెసిస్‌నే సారథిగా ప్రకటిస్తుందని మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. అతడు జట్టులో ఉండటం వల్ల సమతూకం వస్తుందని, ఐపీఎల్‌లో అతడికి అద్భుతమైన రికార్డులు ఉన్నాయన్నాడు.…