ఆర్సీబీ ఆటగాళ్లు ఎం. చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. వారికి ఇంకా పరిస్థితి తెలియకపోవచ్చు. అయితే.. సంఘటనలు జరిగినప్పటికీ వేడుకలు ప్రణాళిక ప్రకారం కొనసాగడం ఆందోళనకరంగా భావిస్తున్నారు. ఈ వేడుకలను ఉద్దేశించి విరాట్ కోహ్లీ మాట్లాడాడు. కానీ అభిమానులు పెద్ద ఎత్తున కేకలు వేశారు. కోహ్లీ.. కోహ్లీ అంటూ అరిచారు. నినాదాలను ఆపివేయమని కోరాడు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయోత్సవ ర్యాలీలో విషాదం చోటుచేసుకుంది. చిన స్వామి స్టేడియానికి ఆర్సీబీ అభిమానులు పోటెత్తడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. అభిమానులు పరుగులు తీయడంతో ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 15 మందికి పైగా గాయాలైనట్లు సమాచారం. అయితే.. ఈ నేపథ్యంలో భారీ జనసమూహం కారణంగా ఆర్‌సీబీ ఐపీఎల్ విజయోత్సవ వేడుకల కోసం ఏర్పాటు చేసిన ఓపెన్-బస్ పరేడ్ రద్దు చేశారు.…