Raviteja: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు న్యాచురల్ స్టార్ నాని గెస్ట్ గా విచ్చేశారు.