ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారినా, పాలకుల విధానాలు మారిపోయానా.... కాకినాడలో రేషన్ మాఫియా తీరు మాత్రం మారలేదట. మేమింతే.... అడ్డొచ్చేదెవడహే....అంటూ విచ్చలవిడిగా రెచ్చిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. డైరెక్ట్‌గా డీలర్ల నుంచే ఎత్తేసి డంప్ చేసుకుంటున్నారట. బియ్యం ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడికి వెళ్లాలనే లెక్కలన్నీ ఒకటో తేదీ నుంచే తయారు అయిపోతున్నాయట.