సినీ ప్రపంచం అంటే గ్లామర్, అందం, ప్రెజెంటేషన్ ఎంత ముఖ్యమో తెలిసిందే. ప్రేక్షకుల దృష్టిలో స్టార్ ఇమేజ్ అంటే కేవలం నటన కాదు లుక్, స్టైల్, ప్రెజెన్స్ కూడా చాలా కీలకం. ముఖ్యంగా హీరోయిన్‌లకు అయితే, బ్యూటీ మెయింటెనెన్స్ అనేది కెరీర్‌లో భాగమే. అందుకే వారు వ్యాయామం, యోగా, స్ట్రిక్ట్ డైట్‌లు, స్కిన్ కేర్, బ్యూటీ ట్రీట్‌మెంట్లు అన్నీ పాటిస్తూ ఉంటారు. తాజాగా ఈ జాబితాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా చేరిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.…