బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ ప్రస్తుతం వరుస షోస్ తో సినిమాలతో బిజీగా తయారయ్యింది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ముద్దుగుమ్మ తన మనసుకు బాధ కలిగించే విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. జంతువులకు హాని చేసినా, మహిళలను కించపరిచేలా మాట్లాడిన రష్మీ తనదైన రీతిలో స్పందిస్తూ ఉంటుంది. ఇక తాజాగా రష్మీ సినీ పరిశ్రమలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ పై గళమెత్తింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఎంతమంది తారలు…
‘జబర్దస్త్’ బ్యూటీ రష్మికి మెగా ఛాన్స్ వచ్చింది అనే వార్త నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం యాంకర్, నటి రష్మీని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. Read Also : ఏపీ ప్రభుత్వాన్ని పునరాలోచించుకోమన్న చిరంజీవి! మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా రూపొందనున్న “భోళా శంకర్”లో చిరు కథానాయికగా తమన్నా నటిస్తుండగా, మెగాస్టార్ సోదరిగా కీర్తి సురేష్ కనిపించనుంది.…
యాంకర్ రష్మీ జంతు ప్రేమికురాలు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా సమయంలో మూగ జీవాల కోసం ఆమె పడిన తపన చెప్పలేనిది. ఇక ఎక్కడైన మూగ జీవాలను హింసిస్తే రష్మీ కోపంతో రగిలిపోతుంటుంది. తాజాగా ఆమె మరోసారి జంతువులను హింసించేవారిపై ఫైర్ అయ్యింది. ఒక కుక్కను ఒక వ్యక్తి హింసిస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ “ఈ వ్యక్తికి మానవత్వం ఉందా..? మానవత్వాన్ని మరిచి ఇంతగా దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాడు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.…
ఇటీవల కాలంలో మూగజీవాలపై దాడులు ఎక్కువ అవుతున్నాయి. గతంలో ఓ కుక్కను కట్టేసి కొట్టి చంపిన వీడియో వైరల్ కాగా సోషల్ మీడియాలో ఓ పెద్ద ఉద్యమమే సాగింది. వారిని అరెస్ట్ చేయాలంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున తమ స్వరం విన్పించారు. ఆ తరువాత వాళ్ళు మైనర్లు అని తేలింది. అయితే మూగజీవాలను మరీ అంతలా ఎలా హింసిస్తారు? అసలు వాటిని ఇలా ఎందుకు బాధ పెడుతున్నారు అంటూ జంతు ప్రేమికులు ఫైర్ అవుతున్నారు. తాజాగా ఇలాంటి…
బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ గతంలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు టాకీస్’ లో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రష్మీ తన నటనతో మెప్పించింది. ప్రస్తుతం ఆ పరిచయంతోనే ఆమెకు మరో అవకాశం లభించిందనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో రష్మీ నటించే అవకాశం దక్కించుకుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, కీలక…