Bride Catch Rasgulla: పెళ్లి వేడుకలో జరిగిన ఓ చిన్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పెళ్లి సమయంలో వరుడికి అతడి తల్లి రసగుల్లా తినిపించేందుకు ప్రయత్నిస్తుండగా, ఆ మిఠాయి చెంచా నుంచి జారిపడి కింద పడబోయింది. అంతే, ఒక్క క్షణంలో వధువు అప్రమత్తమై గాల్లోనే ఆ రసగుల్లాను పట్టేసుకుంది.