Rare Earth Magnet: అత్యంత అరుదైన ఖనిజాలు(రేర్ ఎర్త్ మెటీరియల్)పై చైనా గుత్తాధిపత్యం భారత్‌కి ప్రమాదంగా మారే అవకాశం ఉంది. భారత్ లో అభివృద్ధి చెందుతున్న ఆటోమొబైల్స్ ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)ల మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ తన కొత్త నివేదికలో హెచ్చరించింది.