Karnataka: కర్ణాటక మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అయిన ప్రభు చౌహాన్ కుమారుడు ప్రతీక్ చౌహాన్‌పై అత్యాచారం కేసు నమోదైంది. బీదర్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఒక మహిళ ఫిర్యాదు మేరకు కేసు బుక్ చేశారు. పదేపదే అత్యాచారం, నేరపూరిత బెదిరింపులు, దాడికి పాల్పడినట్లు ఆరోపించింది. ఫిర్యాదు ప్రకారం, డిసెంబర్ 25, 2023లో సదరు బాధిత మహిళతో ప్రతీక్ చౌహాన్ ఎంగేజ్మెంట్ జరిగింది. నిశ్చితార్థం తరువాత పెళ్లి హామీతో పలుమార్లు మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపించింది.