కోళ్లపై వైరస్ పంజా విసురుతోంది.. దీంతో, వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.. ఆంధప్రదేశ్‌లోని గోదావరి జిల్లాల్లో లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు కృష్ణానందం పౌల్ట్రీలో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయ్యింది.. దీంతో పౌల్ట్రీ ఫామ్ నుండి కిలో మీటర్ ప్రాంతాన్ని ఇన్ఫెక్షన్ జోన్‌గా ప్రకటించారు.. ఇన్ఫెక్షన్ జోన్‌లోని కోళ్ల ఫారాలను మూడు నెలల పాటు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు.. 10 కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వేలెన్స్ జోన్‌గా…
గత నాలుగు రోజులుగా ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో నైనిటాల్‌తో ప్రముఖ పర్యాటక ప్రాంతం రాణిఖేత్, అల్మోరాలకు సంబంధాలు తెగిపోయాయి. రాణిఖేత్‌లో కేవలం 24 గంటలకు మాత్రమే సరిపడా ఇంధనం అందుబాటులో ఉందని ఈ ఇంధనాన్ని అత్యవసర సేవలకు మాత్రమే వినియోగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతున్నది. ఇంటర్నెట్ సేవలు స్థంభించిపోయాయి. ఇటు, అల్మోరా ప్రాంతాల్లో కూడా దాదాపుగా ఇలాంటి పరిస్థితి నెలకొన్నది.…