శ్యామ్ సింగరాయ్ వంటి హిట్ మూవీ తర్వాత నేచురల్ స్టార్ నాని నటిస్తున్న కొత్త చిత్రం ‘అంటే సుందరానికి’. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ఆయన శ్రీవిష్ణుతో మెంటల్ మదిలో, బ్రోచెవారెవరురా వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆ రెండు సినిమాలు వివేక్ ఆత్రేయకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. దీంతో అతడికి నాని అవకాశమిచ్చాడు. ‘అంటే సుందరానికి’ సినిమాను ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.…