హర్యానాలో బీజేపీకి షాక్ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మేనల్లుడు రమిత్ ఖట్టర్ గురువారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ విషయాన్ని హర్యానా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో ధృవీకరించింది. హర్యానాలోని రోహ్‌తక్‌లో కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే భరత్ భూషణ్ బన్నా సమక్షంలో రమిత్ ఖట్టర్ కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నారు.