గత ఎన్నికల్లో ఓడిపోవడంతో.. పత్త లేకుండా పోయారు ఆ మాజీ ఐఏఎస్. ఇప్పుడు సడెన్‌గా టీడీపీలో పెద్ద పదవితో తళుక్కుమన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ సీటుకు ఎసరు పెడతారా? అయితే తమ సంగతి ఏంటి? ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు వేస్తున్న ప్రశ్నలివే. ఇంతకీ ఎవరా మాజీ ఐఏఎస్? ఏంటా నియోజకవర్గం? మళ్లీ కోడుమూరు బరిలో దిగుతారా? రామాంజనేయులు. మాజీ ఐఏఎస్ అధికారి. గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్. రిటైరైనా సర్వీస్‌ను పొడిగించడంతో 2019…