అప్పుల బాధతో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటుంది. రామకృష్ణతో పాటు ముగ్గురు చనిపోయిన వ్యవహారంలో రాజకీయ పార్టీలకు చెందిన వారు ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఈ వ్యవహారంలో గోప్యతను పాటిస్తుండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో ఇటీవల జరుగుతున్న ఆత్మహత్యలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. గతంలో ఒక్క వ్యక్తి ఆత్మహత్య వ్యవహారంలో ఓ రాజకీయ నాయకుడి కుటుంబం పాత్ర ఉందని ప్రచారం జరిగింది.…