మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన అభిమానుల అంకితభావానికి ఫిదా అయ్యారు. ఈ మేరకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో, థాంక్స్ నోట్ కూడా పోస్ట్ చేశారు. మెగా అభిమానులు కోవిడ్ -19 మహమ్మారి కాలంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో నిమగ్నమైపోయారు. వారి శక్తి మేరకు వీలైనంత ఎక్కువ మందికి సహాయం చేస్తున్నారు. “అభిమానులు ఈ కోవిడ్ -19 మహమ్మారి సమయంలో కష్టపడి పని చేస్తున్న ఆ సమాజ సేవ గురించి…