విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావును జనం ‘అన్న’గా అభిమానించారు, ఆరాధించారు, ‘అన్న’ అనే అభిమానంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయనను ముఖ్యమంత్రిగానూ నిలిపారు. అంతలా యన్టీఆర్ ‘అన్న’గా జనం మదిలో ముద్రవేశారు. అంతకు ముందు ఎన్ని చిత్రాలలో యన్టీఆర్ అన్న పాత్రల్లో నటించి అలరించినా, ఆయనకు ‘అన్న’గా తరిగిపోని, చెరిగిపోని స్థానం కల్పించిన సినిమా ‘రక్తసంబంధం’ అనే చెప్పాలి. అనేక చిత్రాలలో యన్టీఆర్ కు హిట్ పెయిర్ గా అలరించిన సావిత్రి, ఈ సినిమాలో ఆయనకు చెల్లెలుగా…