Sasivadane: పలాస 1978 లో అద్భుతమైన నటనతో అందరి ప్రశంసలు అందుకున్నాడు కుర్రహీరో రక్షిత్ అట్లూరి. ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో నటించిన రక్షిత్ తాజాగా నటిస్తున్న చిత్రం శశివదనే. పూర్తి ప్రేమ కథా చిత్రంగా ఈ నిమ తెరకెక్కుతుంది. రచయిత, దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన చేసిన ఈ చిత్రాన్ని అహితేజ బెల్లంకొండ నిర్మించారు.
‘పలాస 1978’తో అందరి దృష్టినీ ఆకర్షించిన రక్షిత్ అట్లూరి మరో సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ తో కలసి ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ ‘శశివదనే’ పేరుతో ఈ సినిమా తీస్తున్నారు. కోమలీ ప్రసాద్ హీరోయిన్. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం కాన్సెప్ట్ టీజర్ విడుదల చేశారు. టీజర్‌లో ‘కులం పునాదుల మీద మీరు ఏమీ సాధించలేరు. జాతిని, నీతిని నిర్మించలేరు’ అని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన…