ఢిల్లీకి కొత్త పోలీస్ కమీషనర్‌గా రాకేష్ ఆస్థానాను కేంద్రం నియమించింది. రాకేష్ ఆస్థానాను కమీషనర్‌గా నియమించడంపై ఢిల్లీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీని భయపెట్టేందుకు, పార్టీ నేతలను, పార్టీ కార్యక్రమాలను అడ్డుకునే విధంగా చేసేందుకు రాకేష్ ఆస్థానాను వాడుకుంటుందని ఆప్ విమర్శించింది. రాకేష్ ఆస్థానా స్థానంలో మరోకరిని నియమించాలని కోరుతూ ఢిల్లీ శాసనసభలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని కేంద్ర హోంశాఖలకు పంపించనున్నారు. సాధారణంగా రాష్ట్రాలకు పోలీస్ శాఖల అధిపతులుగా డీజీపీలు ఉంటారు.…