Indian Constitution: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగాన్ని తొమ్మిది భాషలలో డిజిటల్‌గా విడుదల చేశారు. తెలుగు భాష సహా.. మరాఠీ, నేపాలీ, పంజాబీ, బోడో, కశ్మీరీ, ఒడియా, అస్సామీ, మలయాళంలో రాజ్యాంగాన్ని అనువాదించారు. ఈ రోజు మొత్తం దేశం రాజ్యాంగ నిర్మాతలకు గౌరవం ఇచ్చే రోజు అని రాష్ట్రపతి పేర్కొన్నారు.