దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వచ్చే ఏడాది జనవరి 10 వ తేదీ నుంచి 60 ఏళ్లుదాటిన వృద్దులకు బూస్టర్ డోసులు అందించాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. బూస్టర్ డోసులపై తాను ఇచ్చిన సలహాను కేంద్రం స్వీకరించిందని, ఇది మంచి నిర్ణయమని అన్నారు. బూస్టర్ డోసుల రక్షణ ప్రతి ఒక్కరికి చేరాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. …