Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ రాజౌరీ జిల్లాలో అంతుచిక్కని అనారోగ్యం స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ గుర్తు తెలియని అనారోగ్యం కారణంగా మరణించిన వారి సంఖ్య 08కి చేరింది. బుధవారం ఇక్కడ ఆస్పత్రిలో మరో చిన్నారి వ్యాధి కారణంగా మరణించింది. దీంతో ఈ వ్యాధిని గుర్తించేందుకు కేంద్రం నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది.