వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంతో పాటు పట్టణంలో రూ.70 నుంచి రూ.80 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని వేములవాడ ఎమ్మెల్యే సీహెచ్ రమేష్‌బాబు తెలిపారు. ఇటీవల రూ.20 కోట్లు మంజూరయ్యాయని, దశలవారీగా అన్ని పనులు పూర్తి చేస్తామని తెలియజేశారు. వేములవాడ ఆలయ అభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షుడు ఎం.పురుషోత్తంరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్‌బాబు మాట్లాడుతూ 167 ఎకరాల్లో రూ.91.68 కోట్లతో ఆలయ ట్యాంకు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. బండ్ నిర్మాణానికి…