‘సూపర్ స్టార్’ రజనీకాంత్ ఈరోజు (డిసెంబర్ 12) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. నేటితో ఆయనకు 75 ఏళ్లు నిండాయి. చిత్ర పరిశ్రమలో రజనీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. యాక్షన్-ప్యాక్డ్ మాస్ చిత్రాలకు దేశవ్యాప్తంగా కేరాఫ్ అడ్రస్‌గా రజనీకాంత్ ప్రసిద్ధి చెందారు. ఈ వయస్సులో కూడా యాక్షన్ మూవీస్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అయితే వెండితెరపై చాలా మంది హీరోయిన్లతో రజనీ నటించారు. కొందరు ఆయన కంటే వయసులో చాలా చిన్నవారు కూడా ఉన్నారు. రజనీకాంత్ 20 ఏళ్లు…