రంగా రెడ్డి జల్లా రాజేంద్రనగర్ బుద్వెల్ లో గుప్త నిధుల కలకలం రేపిన విషయం తెలిసిందే. గుప్త నిధుల తవ్వకాలపై రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి వివరణ ఇచ్చారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మా టీమ్ ఆ ఇంటి పై రైడ్ చేసిందన్నారు. తవ్వకాలు జరుపుతున్న సమయంలోనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామన్నారు.