ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ 36వ మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన లక్నో ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది. రాజస్థాన్ జట్టు నుంచి సంజు శాంసన్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండగా.. రియాన్ పరాగ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.
రాజస్థాన్ రాయల్స్‌కు సంజు శాంసన్ జట్టు కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ కొనసాగుతున్నారు. ఈ ఇద్దరి సాథ్యంలో టీం ఏడు మ్యాచ్‌లు ఆడి, కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో కింది నుంచి మూడో స్థానంలో ఉంది. అయితే.. రాజస్థాన్ రాయల్స్‌కు సంబంధించి ప్రస్తుతం ఓ టాపిక్ వైరల్‌గా మారుతోంది. రాహుల్ ద్రవిడ్, సంజు శాంసన్ మధ్య విభేదాలు ఉన్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్…