సంగారెడ్డి జిల్లా ఆందోల్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత.. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ.. మాజీ మంత్రి.. ప్రస్తుతం బీజేపీలో ఉన్న బాబూమోహన్ ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు. వేర్వేరు పార్టీలకు చెందిన ఈ ఇద్దరు నాయకులు.. పుల్కల్ మండలంలోని పోచమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనలకు వచ్చారు. కలిసి రాకపోయినా.. ఇక్కడకి వచ్చాక కలిసి ఆత్మీయ ఆలింగనాలు చేసుకున్నారు. పార్టీల మధ్య ఉన్న వైరం నేతల మధ్య కనిపించకపోయినా..…