ప్రముఖ నటి, మాజీ రాజ్యసభ, లోక్ సభ సభ్యురాలు జయప్రద ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె సోదరుడు రాజబాబు (65) ఈరోజు (ఫిబ్రవరి 28) మధ్యాహ్నం అనారోగ్యంతో కన్నుమూశారు. రాజబాబు నెలరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం 3.26 గంటలకు తుదిశ్వాస విడిచారు.