వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఎమ్మెల్యే రాజాసింగ్ కు బీజేపీ ఇచ్చిన డెడ్‌లైన్ రేపటితో ముగియనుంది. రాజాసింగ్ వ్యాఖ్యల మూలంగా హైదరాబాద్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ షోను వ్యతిరేకిస్తూ.. కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఓ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పాతబస్తీ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చెలరేగాయి. రాజాసింగ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చివరకు రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్…