నటి సమంత రాజ్ నిడుమోరు అనే దర్శకుడిని రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, వీరి వివాహం అనంతరం, ఈ వివాహం నేపథ్యంలో వారికి చాలామంది శుభాకాంక్షలు తెలియజేస్తుంటే, కొంతమంది మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. అందులో ముఖ్యంగా, సమంతకు గతంలో వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్‌గా వ్యవహరించిన సాధనా సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక స్టేటస్ వైరల్ అయింది. అందులో ఆమె “అసలైన నేరస్థుడే బాధితుడు అన్నట్టు కలరిచ్చి, ఇప్పుడు తన నిజస్వరూపం బయటపెట్టాడు”…