(ఏప్రిల్ 24న రాజ్ కుమార్ పుట్టినరోజు)తెలుగులిపికి, కన్నడ లిపికి అత్యంత సామీప్యం ఉంటుంది. అలాగే తెలుగువారికి, కన్నడిగులకు కూడా ఎంతో అనుబంధం. కన్నడనాట మన తెలుగు సినిమా వారి ప్రాభవం ఈ నాటికీ వెలుగొందుతూనే ఉంది. స్వరాజ్యానికి పూర్వం ప్రస్తుతం కన్నడనాట ఉన్న పలు కేంద్రాలు ఆ నాడు తెలుగువారి ప్రాభవంతో సాగాయి. అందువల్ల తొలినుంచీ కర్ణాటకలోని బెంగళూరు, బళ్ళారి, హుబ్లీ, హోస్పేట్, రాయచూర్ వంటి కేంద్రాలలో తెలుగువారిదే పైచేయిగా సాగింది. అలాంటి కన్నడ చిత్రసీమలో మకుటంలేని…