ప్రముఖ బాలీవుడ్ నటి మందిరా బేడి భర్త, నిర్మాత, డైరెక్టర్ రాజ్ కౌశల్ కన్నుమూశారు. 49 ఏళ్ళ వయసున్న ఆయన ఈరోజు ఉదయం హార్ట్ ఎటాక్ తో మరణించినట్టుగా తెలుస్తోంది. ఇంత చిన్న వయసులోనే ఆయన మృతి చెందడం బాలీవుడ్ ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన అకాల మరణానికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. 90ల చివర్లో, 2000 మధ్యలో దర్శకుడుగా, నిర్మాతగా స్టంట్ డైరెక్టర్ గా చురుకుగా పలు సినిమాలను తెరకెక్కించారు రాజ్…